
దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుంది
ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలను తీవ్రతరం చేయాలి
ఆదానిని అరెస్టు చేయాలి
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్కౌంటర్లను నిలిపివేయాలి
ఏడవ వాగ్దానమైన ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి
మీడియా సమావేశంలో సీపీఐ (యమ్ యల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య
భారత రాజ్యాంగాన్ని రిపబ్లిక్ ను ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, నవంబర్ 26 నుండి జనవరి 26 వరకు “రాజ్యాంగాన్ని రక్షించండి, రిపబ్లిక్ ను బలోపేతం చేయండి”క్యాంపైన్ లో ప్రజలను భాగస్వాములను చేస్తూ వివిధ రూపాలలో కార్యక్రమాలు చేబట్టాలని సీపీఐ (యమ్.యల్) జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పిలుపునిచ్చారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సీపీఐ (యమ్ యల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పాల్గొని మాట్లాడుతూ… 1925 లో మన దేశంలో ఆవిర్భావించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలను కొనసాగిస్తూ, అనన్య త్యాగాలు చేసింది చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ, తెబాగా, పునప్ర వయాలార్, నక్సల్బరి, శ్రీకాకుళ మొదలగు రైతంగ ఉద్యమాలను మిలిటెంట్ కార్మిక పోరాటలను నిర్వహించిందని తెలిపారు. ఆ పోరాట వారాసత్వాన్ని సీపీఐ (యమ్ యల్) లిబరేషన్ కొనసాగిస్తుందని, మనం 2025 ను శత వార్షికోత్సవ సంవత్సరంగా పాటిస్తూ దేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమ వారసత్వాన్ని స్ఫూర్తిని ప్రజలకు చాటి చెప్పాలని ఆయన అన్నారు. భారత ప్రజల ఆకాంక్షలకు, అభిలాషాలకు విరుద్ధంగా అదే 1925 సంవత్సరంలో పుట్టిన ఆర్.ఎస్.ఎస్, బీజేపీ నేడు అధికారాన్ని చేజిక్కుంచుకొని దేశంలో ఫాసిస్ట్ పాలనను కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగంగా మార్చాలనే కుట్రను కొనసాగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ కుట్రను భగ్నం చేసేందుకు ఫాసిస్ట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఈసంవత్సరమంతా మరింత తీవ్రతరం చేయాల్సిన చారిత్రక కర్తవ్యం ఉందన్నారు. అమెరికా ప్రభుత్వం అదాని అతని అల్లునిపై అతి పెద్ద కుంభ కోణాన్ని ఆపాదిస్తూ..అతని అల్లుడుపై అరెస్ట్ వారెంట్ జారిచేసినా పార్లమెంటులో మోడీ ప్రభుత్వం చర్చకు ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. నేడు ఈ ప్రజా పార్లమెంట్ అదాని ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపి అదానిని అరెస్టు చేయాలాని సీపీఐ (యమ్ యల్) లిబరేషన్ డిమాండ్ చేస్తుందని తెలిపారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏడో గ్యారెంటీ అయినా ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లను కొనసాగిస్తుందని, దీనిని వెంటనే నిలిపివేయాలని అన్నారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్కు పాల్పడిందని, ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష వామపక్ష పార్టీల చెందిన వారిని అరెస్టులు చేస్తున్నారని, నియంత లక్షణాలు బహిర్గతమవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు తప్ప మిగిలిన హామీలు అమలు చేయడం లేదనన్నారు. తెలంగాణలో మతతత్వశక్తుల ప్రమాదం పెరిగిందని, బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అనేక కుట్రలకు పాల్పడుతుందని, దీనిని నిలువరించేందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడాలని ఆయన అన్నారు. వామపక్ష ప్రత్యమ్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకు సీపీఐ (యమ్ యల్) లిబరేషన్ కృషి చేస్తుందన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ (యమ్ యల్) లిబరేషన్ పొలిట్ బ్యూరో సభ్యులు శంకర్, కేంద్ర కమిటీ సభ్యులు, తెలంగాణ ఇంచార్జ్ నైనాలశెట్టి మూర్తి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా పాల్గొన్నారు.