
మృతుని కుటుంబానికి రూ. 23010 వేల ఆర్థిక సహాయం
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన దైనంపెల్లి రవీందర్ ఇటివల అనారోగ్య సమస్యతో మరణించగా వరంగల్ బీఆర్ఎస్కేవీ హోటల్ యూనియన్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. తోటి కార్మికుని కుటుంబానికి బాసటగా నిలిచేలా మృతుని కుటుంబానికి ఆ యూనియన్ తరుపున రూ. 23010 వేల ఆర్థిక సహాయం అందించారు. మృతుడు రవీందర్ ఎన్ఎస్ఆర్కా హోటల్ లో పని చేసేవారని తెలిపారు. తోటి కార్మికుని అకాలమరణం తీరని లోటని, తోటి కార్మికులు కలతచెందే ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ ప్రతినిధులు ఎన్. రఘు, డి. అరుణ్, బి. బిక్షపతి, చిర్రా అనిల్, చిర్ర రాజ్ కుమార్, సురేష్, రతన్, యేసురత్నం, విజయ్, వీరేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.