Bommakanti Sadaiah appointed as Gori Kothapalli Mandal AIHRA President ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అండ్ మీడియా (AIHRA) జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గోరి కొత్తపల్లి మండల అధ్యక్షుడిగా బొమ్మకంటి సదయ్య నియమితులయ్యారు. అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోమండ్ల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండి సదానందం ఉత్తర్వుల మేరకు ఈ నియామకం జరిగింది. నియామక పత్రం అందుకున్న అనంతరం సదయ్య తన బాధ్యతలను స్వీకరించారు.
Bommakanti Sadaiah appointed as Gori Kothapalli Mandal AIHRA President
ఈ సందర్భంగా బొమ్మకంటి సదయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కోమండ్ల శ్రీనివాస్ కు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండి సదానందంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. కులమతాలకు తావులేకుండా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడతానని పేర్కొన్నారు. చట్టానికి లోబడి, మానవ హక్కుల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అవినీతి రహిత సమాజ స్థాపన కోసం తన వంతు బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకం పట్ల స్థానిక నాయకులు, అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సదయ్యకు అభినందనలు తెలిపారు.
