
ఆ ఆసుపత్రిలో చక్రం తిప్పుతున్న అర్హత లేని “ఎంబీబీఎస్”…!
అంతా బహిరంగ రహస్యమే అయినా పట్టించుకునే వారే కరువు…
వైద్యంలో చెలగాటం పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలంటున్న పలువురు…
వరంగల్ జిల్లా నర్సంపేటలో పట్టణంలో అర్హతలేని “ఎంబీబీఎస్”యధేచ్ఛగా ఓ ఆసుపత్రిలో వైద్య వృత్తి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ నర్సింగ్ హోం లో చిన్న డాక్టర్ గా పేరున్న సదరు అర్హతలేని ఎంబీబీఎస్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఆసుపత్రిలో చక్రం తిప్పుతున్న సదరు అర్హతలేని ఎంబీబీఎస్ కు పలుకుబడి కూడా ఎక్కువేనట. తనను కదిలించే వారే లేరనే ధీమాతో చిన్న డాక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అర్హత లేని ఆ చిన్న డాక్టర్ వైద్య సేవలు అందించడంలో, రోగులకు మెడిసిన్ రాయడంలోనూ తనదైన శైలిలో జాగ్రత్తలు పాటిస్తుంటారనేది బహిరంగ రహస్యమే. అయితే
“చిన్న డాక్టర్” చిత్రాలకు ఆ ఆసుపత్రిలో నిఘా నేత్రాలే సాక్ష్యంగా నిలుస్తాయనేది గమనార్హం.