
విచారణ చేపడుతామని హామీ ఇచ్చిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళీ ప్రసాద్
హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి బంధన్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాళిప్రసాద్ కు బాధితుడు జర్నలిస్టు కృష్ణ ఫిర్యాదు చేశారు. తనకు ఆ హాస్పిటల్ లో అందించిన ట్రీట్మెంట్ రిపోర్ట్స్ చూసి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళిప్రసాద్ సానుకూలంగా స్పందించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఐఎంఏ ఈసీలో చర్చించి పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చిన బృందంలో పలువురు వరంగల్ తూర్పు జర్నలిస్టులు పాల్గొన్నారు.