
- అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం…
- 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్
Distribution of grant documents to Indiramma beneficiaries వరంగల్ 37వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని 86మంది లబ్ధిదారులకు శనివారం రోజు స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ కార్యాలయం యందు కార్పొరేటర్ మరియు డివిజన్ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించడం జరిగింది.
ఈ సందర్బంగా స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారి సహకారం తో నియోజకవర్గం కు 3500 ఇండ్లు వస్తే అందులో మంత్రి గారు 37వ డివిజన్ కు ఇప్పటి వరకు 246 మంజూరు పత్రాలు ఇచ్చారని. రాబోయే కాలంలో మరో 100 మందికి ఇండ్లు ఇండ్లు మంజూరు చేస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారని అన్నారు ఈ సందర్బంగా మంత్రివర్యులు కొండా సురేఖ గారికి డివిజన్ ప్రజల పక్షాన ధన్యవాదములు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇచ్చిన హామీకీ అనుగుణంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేసారని. రాబోయే కాలంలో అర్హులైన ఇల్లు లేని పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంగరాబోయిన చందర్, మీడిదుల రాణి, మైదాం లత, మదాసి మధు మరియు ముఖ్య నాయకులు బెడదా వీరన్న, ఆరసం రాంబాబు, బంగారి శ్రీనివాస్, వనపర్తి కర్ణాకర్, ప్రవీణ్, బోలెషా, రాంబాబు,కుమార్, ప్రతాప్, అభిషేక్, కిరణ్,సంబమూర్తి, ఐలయ్య, ప్రభాకర్,జ్యోతి బస్సు,లతో పాటు వార్డు ఆఫీసర్ సత్యనారాయణ, బిల్లు కలెక్టర్ పూర్ణచందర్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.