
MRPS condemns attack on Supreme Court Chief Justice సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయి పై దాడి చేయడం భారత రాజ్యాంగం మీదనే దాడి చేయడం అని హనుమకొండ జిల్లా శాయంపేట మండల ఎమ్మార్పీఎస్ నాయకులు మండిపడ్డారు. గవాయి ఒక దళితుడు అని దళితుడు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఉండడం జీర్ణించుకోలేని అగ్ర కులాల వారు దాడి చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు. ఇదే స్థానంలో ఒక అగ్రకుల వ్యక్తి ఉంటే అతనిపై దాడి చేసి ఉండేవారు కాదని దాడి ఘటనను సుమోటోగా స్వీకరించి నిందితునిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు. దాడి చేసిన వ్యక్తి పై ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం దళితులను చిన్నచూపు చూడడమే అని విచారణ వ్యక్తం చేశారు. శాయంపేట అంబేద్కర్ సెంటర్ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి శాయంపేట మండల ఎమ్మార్వో ఆఫీస్ వరకు గవాయిపై దాడికి నిరసనగా ధర్నా నిర్వహించడం జరిగినది. అనంతరం ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం ప్రమాదంలో పడినట్లుగా ఉందని దళితులు ఉన్నత స్థానంలో ఉండడాన్ని ఉన్నత వర్గాల శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని ఈ సంఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నేరస్తులు మీద కేసు పెట్టకపోవడం అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఎన్నో సంఘటనల మీద కేసులు సుమోటోగా తీసుకున్నటువంటి పోలీసు వ్యవస్థ అలాగే న్యాయ వ్యవస్థ కూడా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవడం లేదు ప్రజలకు తెలపాలని అన్నారు. దళితుడు అయినందుకు ఒక సుప్రీంకోర్టు చీఫ్ మీద దాడి చేస్తే రాష్ట్రాలలో పట్టణాలలో గ్రామాల్లో ఉన్న సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరపాలని లేనియెడల దళిత జాతి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దళితులకు రక్షణ కల్పించే వరకు ఈ పోరాటం ఆగదని అన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు అక్టోబర్ 27న లక్షలాది మందితో హైదరాబాదులో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహించి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ వి జిల్లా నాయకులు అరికల్లా దేవయ్య మాదిగ, ఎమ్మెస్సార్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముక్కెర ముఖేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ శాయంపేట మండల అధ్యక్షుడు తుడుం వెంకటేష్ మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షుడు మామిడి భాస్కర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మారేపల్లి చిరంజీవి మాదిగ, బిహెచ్పిఎస్ శాయంపేట మండల అధ్యక్షులు మామిడి కుమార్ మాదిగ కొప్పుల గ్రామ అధ్యక్షులు మామిడి తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ పత్తిపాక గ్రామ అధ్యక్షులు పోతుగంటి సాంబరాజు మాదిగ మామిడి శ్రీనివాస్ మాదిగ పోతుగంటి తిరుపతి మాదిగ మామిడి కుమారస్వామి మాదిగ విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు జులుగూరి మహేష్ మాదిగ పిఎస్పి గ్రామ అధ్యక్షుడు కొప్పుల సామల భాస్కర్ విహెచ్పిఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు