
- ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్
జన నిర్ణయం / వరంగల్ :గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన రైతుల సన్న ధాన్యం బోనస్ డబ్బులను తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. లేకపోతే రైతులందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈరోజు అఖిల భారత రైతు సమైక్య (ఏఐకేఎఫ్) ఖిలా వరంగల్ మండల కమిటీ ఆధ్వర్యంలో బోల్లికుంట గ్రామంలో రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు రాజ్యం అని చెప్పుతూ ఆచరణలో రైతులు ఇబ్బందుల్లో ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రైతులకు అనేక ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో విస్మరించిందని ఈ క్రమంలో రైతులు పండించిన సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత యాసింగి నుంచి అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఖరీఫ్ సీజన్ 3 నెలలు దాటిన యాసంగి బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయకపోవడం అన్యాయం అన్నారు అసలే రైతులు ఖరీఫ్ వ్యవసాయం సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అప్పులు ఎట్లా తీర్చాలో తెలియక ఆందోళనలో ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో కనీసం యాసంగి బోనస్ డబ్బులు ఎంతోకొంత ఉపయోగపడతాయని ఇప్పటికైనా తక్షణమే రైతులను ఆదుకునే విధంగా బోనస్ డబ్బులను జమ చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులు ఆందోళనకు గురికాకుండా ఐక్యంగా పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు చెవ్వ కుమారస్వామి బంగాళ మహేందర్రెడ్డి సండ్ర నవీన్ కుమార్ మానుపాటి సాంబమూర్తి శ్రీరాముల రవి జక్కుల స్వామి ఎండి షాన్మియా ఎండి రఫీ జి రాజాలు తదితరులు పాల్గొన్నారు.