
- హర్యానా డీజీపీ చీఫ్ సెక్రటరీ, ఎస్పీ లను డిస్మిస్ చేయాలి
- ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట క్రొవ్వొత్తులతో నివాళి
- కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
జన నిర్ణయం / ఓయూ క్యాంపస్ : హర్యానా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మారణ వాoగ్మూలం ఆధారంగా హర్యానా డిజిపి చీఫ్ సెక్రటరీ ఎస్పీ లను తక్షణమే డిస్మిస్ చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు . బుధవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో కేవీపీఎస్ ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మృతి వ్యవస్తీకృత హత్య అని చర్చా గోష్ఠి నిర్వహించారు. ఎస్ ఎఫ్ ఐ ఓయూ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ అధ్యక్షత వహించగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ కులవివక్ష అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విచారకరమని, ఇదీ ముమ్మాటికీ కువివక్ష ఆధిపత్యాన్ని తట్టుకోలేక మృతి చెందాడని ఈ ఘటన పై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారిస్థాయిలో ఉన్న దళితుడికే ఇంత అవమానం జరిగితే సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు? దళితులకు సామాన్యులకు జరుగుతున్న అన్యాయానికి ఇది నిదర్శనం అన్నారు దేశంలో నేడు బిజెపి ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతం పేరుతో సమాజాన్ని విషతుల్యం చేస్తున్నాయని దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై చెప్పు విసిరిన సంగతి మరవకముందే హర్యానాలో ఐపీఎస్ మృతి దేశంలో అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అవమానాలు ఏమిటో విధితమవుతుందన్నారు ఈ దుర్మార్గ సంఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత తక్షణమే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. టిపిఎస్కె రాష్ట్ర కన్వీనర్ జి రాములు మాట్లాడుతూ… ఐపీఎస్ అధికారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడాలని ఆయన కోరారు.దేశ ప్రధాని ఈ ఘటన పై నోరు విప్పాలని డిమాండ్ చేశారు సనాతన ధర్మము ముసుగులో అట్టడుగు దళితులపై దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఓయూ రీసెర్చ్ స్కాలర్ ఆర్.ఎల్ మూర్తి, యూనివర్సిటీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తూటి మహేందర్, ఏఐఎస్ఎప్ రాష్ట్ర కమిటి సభ్యులు ఉప్పల ఉదయ్ కుమార్, పిడిఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద నవీన్, ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత్ మౌర్య, ఎస్ఎస్యూ ఓయూ ప్రెసిడెంట్ నవీన్,ఎస్ ఎఫ్ ఐ , వివిధ సంఘాల నాయకులు శ్రీను కిరణ్ ఆసీఫ్ శ్రీను సురుచి,మౌనిక మొక్షిత శ్యామ్ సన్తదితరులు పాల్గొన్నారు.