
- ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు చొరవ చూపాలి
- ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలి
- 42 గ్రామాల రైతులు ఎదురుచూపు
- వర్ధన్నపేట నియోజకవర్గం లోనే ఎక్కువ విలీన గ్రామాలు
జన నిర్ణయం / చింతగట్టు క్యాంప్ : హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపులో అసైన్ భూమి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలకోటి మహేందర్ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 42 విలీన గ్రామాల రైతులు తీవ్రమైన భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సాదా బయానామ ద్వారా కొనుగోలు చేసిన భూములు పట్టాలు కాకపోవడంతో కొన్ని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని గతంలో ధరణి వెబ్ పోర్టల్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన భూభారతి పోర్టల్ లో సైతం 42 విలీన గ్రామాల రైతుల భూములు సాదబయానామ కేసెస్ అని పట్టాలు కాకుండా పెండింగ్ లో ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. పట్టాలు కాకపోవడంతో రైతులు కొనుగోలు అమ్మకాలు చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు భూములపై హక్కులు లేకుండా పోతున్నాయని ఆయన పేర్కొన్నారు దీని ద్వారా సివిల్ డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు స్పందించి నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఆర్వోఆర్ చట్టం 2025 లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన సుమారు 42 గ్రామాల రైతులకు సాదాబయనామ ద్వారా పట్టాలు జారీచేసి తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కలకోటి మహేందర్ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల రవీందర్ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు . మాట్ల మురళి కలకోట్ల పవన్ కుమార్ స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.