
ప్రియమైన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, యావత్తు ప్రజానీకానికి నమస్కారం
“జన నిర్ణయం” పత్రిక ప్రారంభమై రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నది. ఈ రెండున్నరేళ్ల కాలంలో జన నిర్ణయం పత్రికను ఆదరించి అక్కునచేర్చున్న వారందరికీ కృతజ్ఞతలు. పత్రిక ప్రారంభం నుంచి నేటివరకు ఎవరి పక్షాన నిలబడాలో, ఎవరి పక్షాన వార్తాకథనాలు రాయాలో స్పృహతోనే “జన నిర్ణయం” ముందుకు సాగిందని భావిస్తున్నాం. ఈ క్రమంలోనే అనేక ఒడడిదుడుకులు, అనేక అనుభవాలు “జన నిర్ణయం” చవిచూసింది.
తొలి అడుగు జయప్రదంగా ముందుకు సాగుతున్నది. jananirnayam.com వెబ్ సైట్ తో మరో అడుగు వేసింది. “జన నిర్ణయం” ప్రారంభం నుంచి ఆప్తులకు ఆత్మీయమైంది. మా అక్షరాలు నేరమని భావించిన వారి ఆగ్రహానికీ గురైంది. ప్రజల ప్రయోజనాలకు తప్ప ఆశలకు, అదిరింపులకు మడమ తిప్పని కలాల పొందికగా పత్రిక నిలిచింది. అందుకే పత్రికారంగాన్ని సైతం వదలని అధికారపు అసహనాన్ని తట్టుకుని నిలుస్తోంది. అప్రతిహతంగా ముందుకు సాగుతున్నప్పటికీ
నడవాల్సిన దూరం మాత్రం ఇంకా చాలా ఉన్నది. ఆత్మ సంతృప్తి అడుగులు పడనీయదు. ఆత్మ పరిశీలన మాత్రమే మార్గం సుగమం చేస్తుంది. అందుకే ఈ మన మరో ముందడుగు సమయంలో మరింత బాధ్యత, మరింత కృషి “జన నిర్ణయం” మీద ఉందని ఎరుకతోనే ఉన్నాం.
ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. jananirnayam.com వెబ్ సైట్ తో మీ ముందుకు వస్తున్నాం. జన నిర్ణయం పత్రికను ఆదరించినట్లుగానే jananirnayam.com వెబ్ సైట్ ను కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జన నిర్ణయం జర్నీలో ఎవరికి వారు ఈ పత్రిక తనదిగా భావించిన ఫలితమిది. ఇది ప్రజా పత్రికగా అర్ధం చేసుకుని అందించిన చేయూత ఫలితమిది. అనతికాలంలోనే అందరి అభిమానాలు చూరగొన్న పత్రికగా గుర్తింపు పొందిన పత్రికగా జన నిర్ణయం ఉందనడంలో వెనుకాడటం లేదు. జన నిర్ణయం ప్రయాణంలో నాతో కలిసొస్తూ ప్రజల గొంతుకగా, శ్రామికుల ఆయుధంగా, మరుగునపడ్డ సమస్యలను వెలికి తీయడంలో అక్షరాయుధంగా నిలుస్తున్న “జన నిర్ణయం” కుటుంబ సభ్యులందరికీ అభినందనలు..! అభివందనాలు..!!
ఇది పోటీ ప్రపంచం. పెట్టుబడి ప్రపంచం. పెట్టుబడితో తలపడవల్సిన వైపు మనమున్నాం. తలపడగల పాత్రికేయ సమూహమే మన సైన్యం. విలవిలలాడుతున్న జన సమూహంలో భాగమే మన పాత్రికేయులు కూడా. అయినా ఆకలి అందరికీ ఉన్నదనీ, ‘ఆకలి’ మూలాలను ప్రశ్నించగల చైతన్యం మాత్రం కొందరికే ఉన్నదనీ, ఆ కొందరిలో తామూ ఉన్నామని “జన నిర్ణయం” సిబ్బంది ఎంతో కొంత భావించింది కాబట్టే ఈ ముందడుగు సాధ్యమైంది. ప్రశ్నించటమో… తలవంచటమో తేల్చుకోవాలన్న సవాలు సంకేతాలు, ఎదురు గాలులు ఉన్నప్పటికీ, పత్రికా నిర్వహణ భారం ఉన్నప్పటికీ “మండుటెండల కాలం శాశ్వతం కాదు”అనే ధీమాతో ముందుకు సాగుతున్నాం.
చేపల ప్రాణం నీటిలోనే నిలబడుతుంది. “జన నిర్ణయం” పత్రిక ప్రాణం జనంలోనే ఉంటుంది. ప్రజా సమస్యలు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాలకులకు, ప్రజలకు వారధిగా ఎల్లవేళలా నిబద్ధతతో ముందుకు సాగుతున్నది. ప్రజల అండతో బడుగు, బలహీన వర్గాలకు, అట్టడుగు ప్రజానీకానికి వెన్నుదన్నుగా నిత్యం నిలువవల్సిన బాధ్యతతో “జన నిర్ణయం” ముందుకు సాగుతున్నది. లోపాలను సరిదిద్దుకుంటూ, నైపుణ్యం మెరుగుపరచుకుంటూ, శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలన్న సవాలు స్వీకరిస్తూ “జన నిర్ణయం” ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే jananirnayam.com వెబ్ సైట్ తో మరో అడుగు ముందుకేసి “జన నిర్ణయం” జనం ముందుకు వచ్చింది. ఆదరించి ఆశీర్వదించాలని కోరుతూ….
మీ….
DAMERA RAJENDER (DARA)
Editor in chief
jananirnayam.com
Great job keep going
good luck
Me with U 4ever ever required or not
జై భీమ్ నమో బుద్ధాయ సార్
జన నిర్ణయం పేపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది
నిజాన్ని నిర్భయంగా రాసేటటువంటి మీ పేపర్ నేను చెప్పడం చదువుతూ ఉంటాను Jai Bheem Namo buddhay All 💙✊❤️
Thanks 🙏💙✊
విజయానికి ప్రారంభం ఒక అడుగుతోనే, ప్రశ్నించే కలానికి, గళానికి ఎదురు దెబ్బలు సహజమన్నది చరిత్ర గుర్తు చేస్తోంది.జనం కోసం పని చేయాలన్న తలంపు వచ్చినప్పుడే శత్రు సమూహం పెరిగినట్టు, అది పెరుగుతుంటే మనం మరింత రాటుదేలినట్టే, ఏదీ ఏమైనా మీరు ప్రారంభించిన మరో ప్రయత్నం అప్రతిహతంగా కొనసాగాలని ఆశిస్తూ….
మీ
మిత్రుడు
వేణు బలిజె
జర్నలిస్ట్