
- వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఆరితేరిన అధికారి..!
- ప్రతీ సేవకు ఓ రేటు ఫిక్స్ చేసిన వైనం…
- కోడ్ ఉంటే సరి లేదంటే తిరగాల్సిందే…
- ప్రయివేట్ అసిస్టెంట్ లతో యధేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐ..?
“Shobhan” “code” in the transport department : సినీరంగంలో చెరగని ముద్ర వేసిన హీరో శోభన్ బాబు లాగే వరంగల్ రవాణాశాఖలోనూ శోభన్ కోడ్ కొనసాగుతున్నది. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఆ అధికారి ఆరితేరిపోయారు. ప్రతీ సేవకు ఓ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. కోడ్ ఉంటే సరి లేదంటే తిరగాల్సిందే. ఇదంతా ప్రయివేట్ అసిస్టెంట్ లతో యధేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్న ఆ ఎంవీఐకే చెల్లిందనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలు ఆ కార్యాలయాల్లో అదనంగా ముట్టజెబితేగానీ పని జరగని పరిస్థితి. ఆఫీసుల్లోనే కొందరు ప్రయివేటు సిబ్బంది, దళారులు తిష్ఠవేస్తున్నారు.
“Shobhan” “code” in the transport department
కొందరు అధికారులు ప్రయివేటుగా కొందరిని నియమించుకుని వాహనదారుల నుంచి వసూళ్లు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేయడంలో ఈ అద్భుత నట శోభనుడిది అందవేసిన చేయి. డ్రైవింగ్ శాశ్వత లైసెన్స్ కావాలంటే ద్విచక్రవాహనానికి ఓ ధర, కారుకు మరో రేటు వాహన శాశ్వత రిజిస్ట్రేషన్‌కు, బడి బస్సులు వంటి రవాణా వాహనాల ఫిట్నెస్ రెన్యువల్‌కు ఓ ధర, లెర్నర్ లైసెన్సుకు కంప్యూటర్ పరీక్షకు ఓ ధర వసూలు చేస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనదారులు నేరుగా వెళ్తే ఏవో సాకులతో మళ్లీ మళ్లీ తిప్పిస్తూ దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితుల్ని ఆ అధికారి కల్పిస్తున్నట్లు సమాచారం. “దళారుల ద్వారా వెళ్లే దరఖాస్తులపై పెన్సిల్‌తో ఓ కోడ్ ఉంటుంది. అప్పుడు చకచకా పని అయిపోతుంది. లేదంటే ఏదో సాకుతో మళ్లీమళ్లీ రప్పించుకుంటారు”. ఇది ఈ సత్య హరిశ్చంద్ర నట సామ్రాట్ “శోభన్” బాబు ప్రత్యేకతగా మారిందని వాహనదారుల్లో బహిరంగ చర్చలు సాగడం గమనార్హం.
“Shobhan” “code” in the transport department
ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దీంతో ఆ అధికారి ప్రత్యేక ప్రణాళికలు, దళారుల ఇష్టారాజ్యం మితిమీరిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని, ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.