
- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
Elections should be held for the Greater Warangal Press Club : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్)రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.వి రాజు అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ ప్రతినిధి బృందం ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం కాల పరిమితి పూర్తయినందున వెంటనే ఎన్నికలను నిర్వహించాలని కోరారు.
Elections should be held for the Greater Warangal Press Club
బైలా ప్రకారం ప్రస్తుత ప్రెస్ క్లబ్ కమిటీని రద్దుచేసి నూతన కమిటీని ఎన్నుకొనుటకు షెడ్యూల్ విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని ఇంచార్జి అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, రాష్ట్ర కార్యదర్శి బొక్కా దయాసాగర్, హన్మకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి వి రాజుతో పాటు జిల్లా కార్యదర్శి గోపాల్, దామెర రాజేందర్, రాజేష్, వెంకట్, అంకేశ్వరపు రాజేందర్, దామెర వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.