
- అక్రమ వెంచర్ లను ప్రోత్సహించిన అధికారి…
- వెంచర్ ల వారిగా ప్యాకేజీ లు సెటిల్ చేసుకున్నట్లు ఆరోపణలు…
- మండలంలోని కొన్ని గ్రామాల కేంద్రంగా రియల్టర్ లకు సహకారం అందించిన తహశీల్దార్…
- అక్రమ వెంచర్ లు కావడంతో తహశీల్దార్ కు డిమాండ్ బాగా పెరిగినట్లు ప్రచారం…
Geesugonda Tahsildar Conversion Leelas : ఆ మండలం అక్రమ వెంచర్ లకు కేంద్రంగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మండల తహశీల్దార్ రియల్టర్ లకు పూర్తిస్థాయిలో సహకరిస్తుండడంతో మండలంలో అక్రమ వెంచర్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నట్లు వరంగల్ జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోందట.మండల వ్యాప్తంగా వెలుస్తున్న వెంచర్ లలో 90శాతం వెంచర్ లు అక్రమ వెంచర్ లు కావడంతో సదరు తహశీల్దార్ కు కూడా బాగానే డిమాండ్ పెరిగినట్లు మండల వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయట.వివరాల్లోకెళితే వరంగల్ జిల్లా గీసుగొండ మండల తహశీల్దార్ తన రెవెన్యూ పరిధిలో రియల్టర్ లు చేసే అక్రమ వెంచర్ లను ప్రోత్సహిస్తూ ఆ వెంచర్ లలోని ప్లాట్లను గజాల వారీగా నాలా కన్వర్షన్ చేసినట్లు సమాచారం. తాను నాలా కన్వర్షన్ చేస్తున్న ప్లాట్లు నాన్ లేఅవుట్ వెంచర్ లోని ప్లాట్లే అని తెలిసినప్పటికీ కన్వర్షన్ చేయడం వెనుక మామూళ్ల వ్యవహారం దాగి వుందని పలువురు ఆరోపిస్తున్నారు.
Geesugonda Tahsildar Conversion Leelas
- తహశీల్దార్ రాకతో ఊపందుకున్న రియల్ ఎస్టేట్…
హన్మకొండ జిల్లా దామెర మండల తహశీల్దార్ గా విధులు నిర్వహించి శాసన సభ ఎన్నికల ముందు బదిలీల్లో భాగంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి వచ్చిన సదరు తహశీల్దార్ రాక రియల్టర్ లకు పెద్ద వరంగా మారినట్లు గీసుగొండ మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. 2023 సంవత్సరానికి ముందు గీసుగొండ మండలం లో వెంటిలేటర్ పై ఉన్న రియల్ రంగం ఆ ఎమ్మార్వో రాకతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం గమనించిన తహశీల్దార్ రియల్టర్ ల కు సహకరిస్తూ ప్లాట్లను గజాల వారిగా కన్వర్షన్ చేయడంతో అందిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రియల్టర్ ఎడాపెడా అనుమతి లేని వెంచర్ లు చేసి కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం.
Geesugonda Tahsildar Conversion Leelas
- అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను కన్వర్షన్ చేసిన తహశీల్దార్…
- రియాజుద్దీన్ రాకముందు కన్వర్షన్ లు ఎన్ని? ఆయన వచ్చినాక చేసిన “నాలా”లు ఎన్ని..?
- రియాజుద్దీన్ లీలలపై విచారణ చేస్తే కలెక్టర్ సైతం విస్తుపోవాల్సిందే..?