
- అంతా తానై వ్యవహారిస్తున్న ” ఓ పొలిటిషియన్” ..!
- అధికారులంతా మనోళ్లేనంటున్న అభయహస్తం ఇస్తున్నట్లు ప్రచారం…
- ఎవరేం చేయలేరనే తరహాలో ముందుకు సాగుతున్న ఆ పార్టీ నాయకుడు..
- చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్న అధికారులు…
Illegal venture in Bollikunta : వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ బొల్లికుంటలో యధేచ్ఛగా అక్రమ వెంచర్ దందా సాగుతున్నది. ఓ పార్టీ నాయకుడు అంతా తానై ఆ వెంచర్ వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆ వెంచర్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్ 471/A/1/2 లలో నిబంధనలకు విరుద్ధంగా వెలిచిన వెంచర్ కు అధికారుల ఆశీస్సులు ఉండేలా సదరు నాయకుడు తమ అంగబలం అధికార బలం ప్రయోగిస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. అధికారులు సైతం వెంచర్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా అన్ని రకాలుగా ఆశీర్వదిస్తుండటం బహిరంగ రహస్యంగా మారింది. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా వెలిచిన బొల్లికుంట వెంచర్ పట్ల అధికారులు తగు చర్యలు చేపట్టాలని పలువురు భావిస్తున్నారు.