
- కుడా ఆదాయానికి గండికొట్టి మరీ రియల్టర్ లకు సహకారం..!?
- అక్రమ వెంచర్ లు అని తెలిసినా ..ప్లాట్ల వారిగా నాలా కన్వర్షన్ లు…
- ఒక్కో ప్లాటుకు ఒక్కో రేటు తీసుకొని వందలాది ప్లాట్లు కన్వర్షన్ చేసినట్లు ఆరోపణలు..
- గతంలో విధులు నిర్వహించిన మండలంలో సైతం సారు లీలలపై విమర్శల జోరు…
Tahsildar who helped realtors by cutting into “Kuda”‘s income : వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆ తహశీల్దార్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ఆదాయానికి గండికొట్టడంలో ముందువరుసలో ఉన్నట్లు సమాచారం.వరంగల్ జిల్లాలోని ఆ మండలంలో విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్ రియల్టర్ లు చేసే అక్రమ వెంచర్ లకు సహకరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. మండల పరిధిలో అనుమతి లేకుండా వెంచర్ లు చేస్తున్న రియల్టర్ లకు సదరు తహశీల్దార్ పెద్దన్న పాత్ర పోషిస్తూ పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించడం గమనార్హం.హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం నుండి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆ మండలానికి శాసన సభ ఎన్నికల ముందు బదిలీ అయిన సదరు తహశీల్దార్ అక్రమ వెంచర్ లను ప్రోత్సహిస్తూ భారీ నజరానాలను పొందినట్లు మండల కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tahsildar who helped realtors by cutting into “Kuda”‘s income
ప్లాటుకో రేటు..?
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) పరిధిలో ఎలాంటి వెంచర్ చేయాలన్న కుడా అనుమతి తప్పనిసరి .”కుడా” నిబంధనల ప్రకారం వెంచర్ లోని 10 శాతం భూమిని గ్రీనరీకి కేటాయించడంతోపాటు,వెంచర్ లో కనీస అవసరాలు అయినటువంటి రోడ్లతోపాటు, డ్రైనేజీ ని నిర్మించి వాటి అవసరాల నిమిత్తం భూమి కేటాయించడంతోపాటు వెంచర్ లోని10శాతం భూమిని “కుడా” పేరుమీద మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కుడా అధికారులు వెంచర్ కు అనుమతి ఇస్తారు. కానీ అక్రమ వెంచర్ దారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ లు చేసి ఈజీగా ప్లాట్లను అమ్ముతున్నట్లు సమాచారం. అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ లు రిజిస్ట్రేషన్ చేయడంలేదని తెలుసుకున్న రియల్టర్ వెంచర్ లలోని ఒక్కో ప్లాటుకు, ఒక్కో రేటు సదరు తహశీల్దార్ కు చెల్లించి నాలా కన్వర్షన్ చేపించుకొని తద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేపించుకుంటున్నట్లు విశ్వసనీయత సమాచారం.అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను( ప్లాట్ల వారిగా) కన్వర్షన్ చేసినందుకు గాను ఏరియాను బట్టి ప్లాటుకో ధర నిర్ణయించి ఇప్పటికీ లక్షలాది రూపాయలు సదరు తహశీల్దార్ కొల్లగొట్టినట్లు రియల్టర్ లు మాట్లాడుకోవడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే ఈ తహశీల్దార్ కన్వర్షన్ చేసిన ప్రతీ ప్లాటు నాన్ లేఅవుట్ వెంచర్ లలోనిదే అనే విషయం తహశీల్దార్ కు తెలిసే చేయడం గమనించాల్సిన అంశం.
Tahsildar who helped realtors by cutting into “Kuda”‘s income
దామెర మండలంలోనూ విమర్శలు..
వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం లో ప్రస్తుతం తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సదరు తహశీల్దార్ రియల్టర్ లకు ప్రధాన్యతనిస్తూ అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను కన్వర్షన్ చేసి అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారి గతంలో హన్మకొండ జిల్లా దామెర మండలంలో విధులు నిర్వహించిన సమయంలో సైతం అనేక అవకతవకలకు పాల్పడ్డట్లు రెవెన్యూ శాఖలో ప్రచారం జరుగుతోంది. దామెర మండలంలో కొంతమంది రియల్టర్ లకు సహకరించిన ఈ తహశీల్దార్ నాన్ లేఅవుట్ వెంచర్ లకు సైతం గట్టిగానే సహకరించి బాగానే వెనకేసినట్లు దామెర మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
- గీసుగొండ మండలంలో తహశీల్దార్ ఘనకార్యలు, గతంలో విధులు నిర్వహించిన దామెర మండలంలో ఆయన చేసిన లీలలు…. సంచలన కథనం మీ జన నిర్ణయంలో….