
- అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన “ఏఐఎఫ్ డిఎస్” ప్రతినిధి బృందం
- తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్…
- హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్ కు ఫిర్యాదు…
Why so much love for “Vedanthu” : ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటున్న “వేదాంతు” జూనియర్ కళాశాలను సీజ్ చేసి యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోపాల్ కు కలిసి వినతి పత్రం అందజేశారు.
Why so much love for “Vedanthu” :
ఈ సందర్భంగా ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి మాట్లాడుతూ…హనుమకొండ నగరంలో యధేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా వేదాంతు లెర్నింగ్ సెంటర్ పేరుతో ప్రచారం చేస్తూ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. “వేదాంతు”కు ఇంటర్మీడియట్ కాలేజీ అనుమతులు వచ్చే అవకాశం లేకున్నా విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. “వేదాంతు” జూనియర్ కాలేజ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ కోచింగ్ సెంటర్ పై చర్యలు చేపట్టకుండా అతి ప్రేమ చూపడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.
Why so much love for “Vedanthu” :
వేదాంతు లెర్నింగ్ సెంటర్ పేరుతో తప్పుడు ప్రచారంతో జూనియర్ కాలేజీ అడ్మిషన్లు తీసుకుంటున్న వేదాంతు యజమాన్యంపై చీటింగ్ కేసు నమోదు చేయాలని, నగరంలో అనుమతులు లేకుండా పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను జూనియర్ ఇంటర్లో చేర్చుకుంటు పిఆర్వోలను పెట్టి అనుమతులు ఉన్నాయని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అడ్మిషన్ చేస్తూ నైపుణ్యం కలిగిన విద్యార్థులకు 90 శాతం వరకు ఫీజులో రాయితీ ఉంటుందని తప్పుడు ప్రచారం చేస్తూ బయటకు మాత్రం “మాది జూనియర్ కాలేజ్ కాదు కోచింగ్ సెంటర్” అంటూ విద్యార్థి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపణలు. వేదాంతు జూనియర్ కాలేజీ కానప్పుడు పదో తరగతి పూర్తయిన విద్యార్థులను ఎందుకు చేర్చుకుంటున్నారని “వేదాంతు” యాజమాన్యమే సమాధానం చెప్పాలని గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి అన్నారు.
Why so much love for “Vedanthu” :
జేఈఈ నీట్ కోచింగ్ పేరుతో ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది, పిఆర్వోలకు టార్గెట్ ఇస్తూ ప్రతి అడ్మిషన్ పై పర్సంటేజ్ లు ఇస్తూ జిల్లా వ్యాప్తంగా రంగంలోకి వేదాంతు జూనియర్ కాలేజ్ తన పిఆర్వోలను రంగంలోకి దింపిందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ లలో నడిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తుంటే, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు, ఎందుకు స్పందించడం లేదని ప్రవేట్ కాలేజీలకు వత్తాసు పలుకుతున్నారని గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి విమర్శించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు”వేదాంతు”పై తక్షణమే చర్యలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొలబోయిన రాజు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.