
- ఏ బియ్యం వచ్చినా నల్లబెల్లిలో తమ దందా సాగేలా ప్రణాళికలు…
- “బాలసంత” రేషన్ దందాకు జిల్లాస్థాయి వరకు సపోర్ట్ ఉందనే ధీమా…
- యధేచ్ఛగా రేషన్ దందా సాగుతున్నా … ఏం జరగడం లేదని పలు శాఖల ఉద్యోగులు కవర్ చేస్తున్నట్లు ఆరోపణలు…
- సన్నబియ్యాన్ని సైతం “బాలసంత” సంచుల్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం…
- టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘా మరింత పెంచితే అడ్డంగా దొరికే అవకాశం…
Ration scame alternative master plan: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. ఉగాది నుంచి సన్నబియ్యం అందించనున్న నేపథ్యంలో రేషన్ దందా దారులు కొత్త దారులు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో రేషన్ దందా గుట్టుగా కాసుల పంటగా సాగిన క్రమంలో సన్నబియ్యం పంపిణీ అనేది రేషన్ దందా దారులకు ఒక సవాల్ గా మారినట్లుగా భావిస్తున్నారు. అయితే నల్లబెల్లి మండలంలో “సన్నబియ్యం”పై సైతం”బాలసంత” సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏ బియ్యం వచ్చినా నల్లబెల్లిలో తమ దందా సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. “బాలసంత” రేషన్ దందాకు జిల్లాస్థాయి వరకు సపోర్ట్ ఉందనే ధీమాతో ముందుకు సాగుతున్నట్లు ఆ మండలంలోనే కాదు జిల్లాలోని పలువురి మాటల్లో వినిపిస్తోంది. యధేచ్ఛగా రేషన్ దందా సాగుతున్నా ఏం జరగడం లేదని పలు శాఖల ఉద్యోగులు కవర్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకు ఆశీస్సులు అందించే వారి అండతో సన్నబియ్యాన్ని సైతం “బాలసంత” సందుల్లోకి వచ్చేలా సమాలోచనలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘా మరింత పెంచితే అడ్డంగా దొరికే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.