
- నల్లబెల్లిలో “రేషన్ కింగ్” చుట్టంగా మారుతున్న చట్టం..!
- రేషన్ అక్రమరవాణా దందాలో 6ఎ సెక్షన్ కేసులతోనే సరిపెడుతున్న అధికారులు…
- పీడీయాక్ట్ నమోదు చేయకపోవడంతో లైట్ గా తీసుకుంటున్న రేషన్ దందా దారులు…
- నల్లబెల్లిలో “బాలసంత” రేషన్ దందాపై పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు…
- కొంతమంది అధికారులు ఆశీస్సులతో వర్థిల్లుతున్న “బాలసంత” చీకటి వ్యాపారం….
There is no fear of “Section 6A” in the ration scam : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని ఎందుకు ఆగడం లేదు..? పైగా ఎందుకు పెరుగుతోంది..? శిక్షలంటే భయం లేకనా..? లేకా పెట్టే కేసులు బలహీనంగా ఉండడం వల్లనా..? పడే శిక్షలు తక్కువ ఉండటమే కారణమా..? లేకా కొందరు అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటం వల్లనా..? ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్నలివి. పలు సందర్భాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పట్టుబడి కేసులు అవుతున్నప్పుటికీ ఈ దందా నిర్వహించే అక్రమార్కుల సంఖ్య కూడా పెరుగుతుండటమే కాదు మరింత బరితెగింపుతో రేషన్ దందా చేయడం కేసులంటే వారికి భయం లేదన్న విషయం స్పష్టం చేస్తోంది. ఇందుకు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని సాగుతున్న అక్రమ రేషన్ దందా సాక్ష్యంగా నిలుస్తోంది పలువురు భావిస్తున్నారు.
There is no fear of “Section 6A” in the ration scam : చౌక బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ప్రయోగిస్తున్న 6ఎ కేసులు పెద్దగా ప్రయోజనం ఇవ్వడం లేదన్నట్లుగా రేషన్ దందా వ్యవహారం చూస్తే అర్థం అవుతుంది. ఇందుకు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని “బాలసంత” నేతృత్వంలో యధేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం దందానే సాక్ష్యంగా నిలుస్తోందని పలువురు భావిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న అధికారులు, టాస్క్ఫోర్సు పోలీసులు వారిపై అత్యవసర సరుకుల చట్టం 1955లోని 6ఎ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ దందా మరింతగా విస్తరించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సెక్షన్ కింద శిక్షలు స్వల్పంగా ఉండడంతో యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
There is no fear of “Section 6A” in the ration scam
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులపై అత్యవసర సరుకుల చట్టంలోని 6ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు. చట్టంలో ఈ సెక్షన్ కింద అక్రమార్కులపై జరిమానా, శిక్షలను నిర్దేశిస్తోంది. మొదటిసారి అక్రమంగా సరుకులు తరలిస్తే వారికి మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంది. జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. రెండోసారి పట్టుబడితే ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా విధించవచ్చు. అక్రమ వ్యాపారానికి అవకాశం కల్పించిన, ప్రేరేపించినా శిక్షించే అవకాశం ఉంది. పట్టుబడిన సరుకును సక్రమమే అంటూ లెక్కలు చేపించే ప్రయత్నం చేసిన వారికి సైతం శిక్ష ఉంటుంది. రైస్‌మిల్లర్లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసిన కస్టమ్ రైస్‌కు తరలించినట్టు రుజువైన పక్షంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
There is no fear of “Section 6A” in the ration scam
వాస్తవానికి బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న అక్రమార్కులు, వారి నుంచి వాటిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మూడు సార్లు పట్టుబడితే పీడీ యాక్టు కింద నమోదు చేయాలి. కానీ అక్రమార్కులు రేషన్ బియ్యం పట్టుబడినప్పుడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన సమయంలో తమ పేర్లు లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. గతేడాది ఇదే వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పట్టుబడిన “బాలసంత” రేషన్ టీం పట్టుబడినప్పపికీ సద్దుమనుగడం కంటే మరింత రెచ్చిపోవడం గమనార్హం. ఒకటి, రెండుసార్లు పట్టుబడినప్పుడు సెక్షన్ 6ఎ కింద కేసు నమోదవుతుండడంతో తేలిగ్గానే బయటపడుతుండటమే ఇందుకు కారణగా పలువురు భావిస్తున్నారు. మూడోసారి పట్టుపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ చీకటి రేషన్ బియ్యం దందాను యధేచ్ఛగా సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
There is no fear of “Section 6A” in the ration scam
- వ్యాపారంగా మారిన రేషన్ బియ్యం దందా
నల్లబెల్లి మండలంలో రేషన్ బియ్యం దందాను ఒక వ్యాపారంగా మార్చుకున్న “బాలసంత” లబ్ధిదారుల నుంచి ఉచిత బియ్యం సేకరణకు గ్రామాల్లో ఏకంగా ఏజెంట్లనే ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. సేకరించిన బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వచేసి అదనుచూసి పోలీసులు, పౌరసరఫరాల అధికారుల కళ్లు కప్పి లారీలు, వ్యాన్లలో తరలిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా రేషన్ బియ్యం దందాను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.
- నల్లబెల్లి మండలంలో యధేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం దందాకు ఆశీస్సులు ఇస్తున్నదేవరు..? 12 టైర్ల లారీలో ప్రతినెలా తరులుతున్న రేషన్ బియ్యం కథ ఏంటి..? బాలసంతా కిషనుడి చీకటి దందాపై సమగ్రమైన కథనం మరో సంచికలో….