
Oplus_131072
- నల్లబెల్లిలో వర్థిల్లుతున్న చీకటి దందా…
- అడ్డేలేదంటూ రెచ్చిపోతున్న రేషన్ కింగ్..!
- యథేచ్ఛగా సాగుతున్న రేషన్ బియ్యం దందా…
- అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రేషన్ దందాకు అట్టుకట్ట వేయాలంటున్న పలువురు…
Ration rice scam : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. జిల్లాలో రేషన్ బియ్యం దందాను అరికట్టేందుకు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపడుతున్నప్పటికీ నల్లబెల్లి మండలంలో మాత్రం రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. అడ్డేలేదంటూ రేషన్ కింగ్ చీకటి దందా యధేచ్ఛగా సాగుతోందనేది బహిరంగ రహస్యంగా మారింది. ఒకరకంగా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులకు, పోలీసులకు సవాల్ అన్నట్లుగా “బాలసంత” జేబులోకి రేషన్ బియ్యం చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు రేషన్ బియ్యం దందాకు కొందరు అధికారుల సపోర్ట్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Ration rice scam
ఇక నల్లబెల్లి మండలంలో రేషన్ బియ్యం దందాను ఒక వ్యాపారంగా మార్చుకొని “కిష్”కింధకాండ సాగుతున్నా అధికారులు అంతగా పట్టించుకోకపోవడంలో అంతర్యం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. రేషన్ బియ్యం సేకరణకు అక్రమార్కులు గ్రామాల్లో ఏకంగా ఏజెంట్లనే నియమించుకుంటున్నారనేది గమనార్హం. సేకరించిన బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వచేసి అదనుచూసి ఇతర ప్రాంతాలకు ప్రణాళికబద్దంగా తరలిస్తున్నారనేది బహిరంగ రహస్యమే.
Ration rice scam
అయితే రేషన్ బియ్యం దందా చేస్తున్న అక్రమ వ్యాపారులపై అత్యవసర సరుకుల చట్టంలోని 6ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి. ఈ 6ఎ సెక్షన్ కేసులను కూడా అంతగా పట్టించుకున్నట్లు కనిపించకపోవడం ఒక భాగమైతే నల్లబెల్లి మండలంలో ఈ అత్యవసర సరుకుల చట్టంలోని 6ఎ సెక్షన్ అమలు జాడే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా రేషన్ బియ్యం దందాను బంగారు గుడ్లు పెట్టే బాతులా భావిస్తున్న రేషన్ మాఫియాకు అడ్డుకట్టవేసేలా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
- నల్లబెల్లి మండలంలో రేషన్ బియ్యం దందా చేస్తున్న అక్రమ వ్యాపారులపై అత్యవసర సరుకుల చట్టంలోని 6ఎ సెక్షన్ అమలు తీరుపై సమగ్ర కథనం త్వరలో….