
- కీర్తి హాస్పటల్ భవన్ పై చర్యలకు జంకుతున్న అధికారులు..!
- పొంతన లేని సమాధానాలు చెప్పుతున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్..!!
- నిద్రావస్తాలో మున్సిపల్ అధికారులు…
- అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు…
- కీర్తి హాస్పటల్ పై అతిప్రేమ చూపిస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్…
- కమిషనర్ కీర్తి హాస్పిటల్ నిర్మాణంపై సమగ్రమైన విచారణ చేపట్టాలంటున్న పలువురు…
Illegal constructions that are pouring in money : హనుమకొండ నగరంలోని అక్రమ నిర్మాణాలు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఉపేక్షించేదే లేదని, కొరడా జలుపిస్తామని గొప్పలు చెబుతున్న మున్సిపల్ కమిషనర్ కు కీర్తి హాస్పటల్ భవనం కనబడడం లేదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీర్తి హాస్పటల్ భవనం అక్రమ నిర్మాణమని అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. నగరం నడిబొడ్డున నిత్యం అధికారుల సంచరించే ప్రాంతంలో ఈ నిర్మాణం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారనే ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాలని పలువురు భావిస్తున్నారు.
Illegal constructions that are pouring in money
మరోవైపు ఈ నిర్మాణానికి ఓ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నగర ప్రణాళిక కార్యాలయంలో ముడుపులు ముట్ట చెపితే ఏ పనైనా సాధ్యమవుతుందని, ప్రతి పనికో రేటు ఉంటుందని, డబ్బులు ముట్ట చెప్పినట్లయితే ఆ నిర్మాణంపై ఎటువంటి ఫిర్యాదులు అందిన పట్టించుకోరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఫిర్యాదారుల నుండి ఒత్తిడి పెరిగితే నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తారని అధికారుల తీరుపట్ల అసహనం వ్యక్తమవుతోంది. ఓవైపు అక్రమ అంతస్తులు నిర్మించి, వాణిజ్యపరమైన కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడానికి సిద్ధంగా ఉన్న కీర్తి హాస్పటల్ పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమ సొంత ఆదాయంపై దృష్టి సాగిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. అక్రమ నిర్మాణం అని తెలిసినప్పటికీ కీర్తి హాస్పటల్ భవన్ పై అధికారులకు అంత మమకారం ఎందుకని, అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందిస్తారా..! లేదంటే జిల్లా కలెక్టర్ అయినా ఈ అక్రమ నిర్మాణం పై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.