
Oplus_131072
- ఆ “ఆర్ఎంపీ”కి అధికారుల ఆశీస్సులు..!
- నల్లబెల్లి “శ్రీలక్ష్మి ప్రథమ చికిత్స కేంద్రం” పై చర్యలు చేపట్టకపోవడం పట్ల విమర్శలు…
- అర్హతకు మించి వైద్యం చేసి ప్రాణాలతో చెలగాటం ఆడినా చర్యలు చేపట్టని అధికారులు…
- ఆ క్లినిక్ ను తక్షణమే సీజ్ చేసి ఆర్ఎంపీ పై చర్యలు చేపట్టాలంటున్న బాధితులు…
- ఆందోళనతో పాటు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్న బాధితులు….
No action taken against RMP who provided treatment beyond his qualifications : అర్హతకు మించి వైద్యం చేసి ఆ వైద్యం వికటించడంతో క్లినిక్ ను తాత్కాలికంగా మూసేస్తే అసలు విషయం మాసిపోతుందని సదరు ఆర్ఎంపీ బావిస్తున్నారో ఏమో… తెలివిగా బాధితులనే కాదు అధికారుల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని శ్రీలక్ష్మి ప్రథమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఓ ఆర్ఎంపీ అర్హతకు మించిన వైద్యం చేసిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. రుద్రగుడెం గ్రామానికి చెందిన బాధితుడికి వైద్యం వికటించిన ఉదాంతం చర్చానీయాంశంగా మారడంతో ఆ శ్రీలక్ష్మి ప్రథమ చికిత్స కేంద్రం ( క్లినిక్ ) ను తాత్కాలికంగా మూసేసి అతితెలివిగా ఆర్ఎంపీ వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంకో అడుగు ముందుకేసి నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా బాధితులనే బదనం చేసే ఆరోపణలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ “ఆర్ఎంపీ”కి అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం పర్యవేక్షణ లేకపోవడం, చర్యలు చేపట్టకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హతకు మించి వైద్యం చేసి ప్రాణాలతో చెలగాటం ఆడినా ఆర్ఎంపీ పై చర్యలు చేపట్టకపోవడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా ఆ క్లినిక్ ను తక్షణమే సీజ్ చేసి ఆర్ఎంపీ పై చర్యలు చేపట్టాలంటున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు ఆందోళనతో పాటు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు చర్యలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకుంటారా లేదా అనేది వేచిచూడాల్సిందే….