
Oplus_131072
- తనను కదిలించే వారే లేరని ధీమా వ్యక్తం చేస్తున్న పోస్ట్ మాన్…
- పోస్టల్ శాఖలో ఆయనకు ఆశీస్సులు పుష్కలం…
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నల్లబెల్లి “పోస్ట్ మాన్”
Shouldn’t everyone hug that “postman” : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని పోస్ట్ మాన్ ను అందరూ చుట్టాలేనట. ఆయనను కదిలించే వారే లేరట. ఆ శాఖలో ఆయన చెప్పిందే వేదమట. వివిధ రకాల ఫించన్ల పంపిణీలో సదరు పోస్ట్ మాన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జన నిర్ణయం వరుస కథనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే సదరు పోస్ట్ మాన్ కు పోస్టల్ శాఖలో పుష్కలంగా ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ శాఖలో ఉన్నతాధికారుల అండతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ పోస్ట్ మాన్ ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తూ తనను కదిలించే వారే లేరని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. అయితే వివిధ రకాల ఫించన్ల పంపిణీతో పాటు పోస్టల్ శాఖను తన సొంత శాఖగా మలుచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం సదరు పోస్ట్ మాన్ పట్ల వస్తున్న ఆరోపణలపై కనీసం విచారణ కూడా చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల ఆశీస్సులతోనే ఆ పోస్ట్ మాన్ చిత్రవిచిత్రాలు చేస్తున్నరని అధికారుల తీరే ఇందుకు సాక్ష్యమని చర్చలు సాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సదరు పోస్ట్ మాన్ పనితీరు పట్ల సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది గమనార్హం.