
Oplus_131072
- యధేచ్ఛగా అదనపు అంతస్తుల నిర్మాణం…!
- అంతా తెలిసి మౌనంగా ఉన్న టౌన్ ప్లానింగ్..!!
Violations of municipal regulations : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా సాగుతున్నాయనేది బహిరంగ రహస్యంగా మారింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టవేయాల్సిన అధికారులే ఆ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో పలువురు బడాబాబులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల వెనుక టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న కొంతమంది అధికారుల సహకారం ఉండని బహిరంగంగా ప్రచారం జరుగుతోంది.
Violations of municipal regulations హనుమకొండ నగరం నయీంనగర్ రంగు బార్ ప్రాంతంలో అనుమతులు పొందిన దానికంటే అదనపు అంతస్తులు నిర్మించినట్లు సమాచారం. సామాన్యులు అనుమతి లేకుండా చిన్న చిన్న గృహాలు నిర్మించుకుంటేనే నిబంధనల పేరుతో కూల్చివేసే టౌన్ ప్లానింగ్ అధికారులు హనుమకొండ నగరం నడిబొడ్డున నిబంధనలకు విరద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించిన విషయం తెలిసినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేది గమనార్హం. ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాల పట్ల తగు చర్యలు చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.