
Oplus_131072
వరంగల్ జిల్లా చెన్నా రావుపేట మండల కేంద్రంలోని హైస్కూల్ చెన్నారావుపేట పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మానుపాటి పాపమ్మ ఆధ్వర్యం లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఈరోజు విద్యార్థులే ఉపాధ్యాయులు గా వుండి పాఠశాలలో ఘనంగా స్వయంపరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో డిఈఓగా టేకుల క్రాంతి, ఏఏంఓ .గా బిషెట్టి రిషి, ఏంఈఓగా ఎస్.కే.అఫ్సర్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా చిరుతం సౌమ్య స్వయంపరిపాలన దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకల లో పాల్గొన్న విద్యార్థులు వారి అభిప్రాయంలను తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం ను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపమ్మ మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించాలని తెలిపారు.విద్యార్థులు క్రమశిక్షణతో వుండి పాఠశాలకు ప్రతిరోజూ హాజరుకావాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు కిషోర్,రవి, ఉమాదేవి, రజినీ, అనుపమ, శ్రీనివాసరెడ్డి, కౌశీర్ ఆఫీసు సిబ్బంది రాజశేఖర్, సునీల్, సీఆర్పి లు సంపత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.