
Oplus_131072
Trump’s tariff pressures – India’s surrender ప్రస్తుతం భారత్ మెడపైన అమెరికా టారిఫ్ ల కత్తి వేళాడుతుంది!డోనాల్డ్ ట్రంప్ విధించే ప్రతీకార సుంకాల ఒత్తిళ్లకు అతని సన్నిహిత మిత్రుడు మోదీ సర్కారు సైతం తలొగ్గక తప్పటం లేదు. ముఖ్యంగా కార్లు, రసాయన దిగుమతులపై టారిఫ్ ల కోతలకు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.తమ దేశ వస్తు ఉత్పత్తులపై అధిక సుంకాలను వేస్తున్న దేశాలకు ప్రతీకార సుంకాలు తప్పవని అగ్రరాజ్య అధ్యక్షుడు ఈమధ్య కాలంలో పదేపదే ప్రపంచ దేశాలకు హెచ్చరించి చెప్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ కు సుంకాల పోటు ఉంటుందని ఇటీవలి అమెరికా పర్యటనలో సైతం ప్రధాని మోదీకి ట్రంప్ నిర్మొహమాటంగా తేల్చి చెప్పిన సంగతీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తమైనట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి భారత్ కు వస్తున్న వివిధ రకాల దిగుమ తులపై ప్రస్తుతం విధిస్తున్న సుంకాలను గణనీయంగా తగ్గించేందుకున్న అవకాశాలను అన్వేషిస్తున్నట్టు సంబంధిత అధికార వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితి:
Trump’s tariff pressures – India’s surrender
కార్లు, మోటర్సైకిళ్లు తదితర ఆటోమొ బైల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, కీలక ఔషధాలు, కొన్ని వైద్య పరికరాలు,ఎల క్ట్రానిక్స్, విస్కీతో సహా మరికొన్నింటిపై వసూలు చేస్తున్న సుంకాలను తగ్గించే వీలుందంటున్నారు. తద్వారా అమెరికా అధిక సుంకాల నుంచి తప్పించు కోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వం.. అమెరికా సుంకా లను తప్పించు కోవడానికి ఇప్ప టికే నిర్దేశించు కున్న సుంకాల కోత కంటే ఇంకా ఎక్కువగానే టారిఫ్ లను తగ్గించాల్సి రావచ్చన్న అంభిప్రాయాలను వారు వెలిబుచ్చుతుండటం గమనార్హం. దీంతో చాలా రకాల వస్తు, సేవల దిగుమతులపై పెద్ద ఎత్తునే సుంకాలు తగ్గవచ్చని చెప్తున్నారు.
అమెరికా మైత్రి కోసం ఆరాటం:
Trump’s tariff pressures – India’s surrender
ప్రస్తుతం అమెరికా సుంకాల హెచ్చరికలు… యావత్తు ప్రపంచ వాణిజ్యాన్నే వణికిస్తు నేపథ్యంలో… ఇప్పటికే స్టాక్, కరెన్సీ, కమోడిటీ మార్కెట్లపై ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్న ధోరణిని చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఆయా దేశాలతో పాటు భారత్ సైతం అమెరికాతో స్నేహ పూర్వక వాతావరణానికి ప్రయత్నిస్తున్న రేసులో ఉంది. ముఖ్యంగా చైనాతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ కాలు దువ్వుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవకాశాలను భారత్
అంది పుచ్చుకునేందుకు చొరవ చూపాలని మన దేశంలో మెజారిటీ ఆర్ధిక నిపుణులు కూడా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. నిజానికి ఒకవైపు గ్లోబల్ మార్కెట్లో చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ ను ప్రోత్సహించడమే మార్గమని అమెరికా సైతం భావిస్తుంది. దీంతో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం బలో పేతంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. మరోవైపు భారత్ కు రక్షణ పరమైన ఎగుమతుల్ని పెంచాలని కూడా అమెరికా చూస్తున్నది. అయితే అవి ఇప్పుడు రష్యా నుంచే ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయి. ఫలితంగా రష్యాతో ఉన్న సంబంధాలు చెడకుండా, ట్రంప్ మెప్పును పొందే పనిలో మోదీ సర్కారున్నట్టు చెప్తున్నారు. ఇక 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని అటు అమెరికా, ఇటు భారత్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2023లో ఇది 127 బిలియన్ డాలర్లేగానే ఉంది.
మెక్సికో,కెనడాలపై టారిఫ్ లు ?
Trump’s tariff pressures – India’s surrender
పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై టారిఫ్ ను మంగళవారం నుంచి విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం యూనివర్సల్ టారిప్ లను రెట్టింపు చేయాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, ఆమె రికాలోకి ఎంతమాత్రం ఉపేక్షించని విధంగా మనుషుల అక్రమ రవాణా, ఔషధాల స్మగ్లింగ్ జరుగుతున్నదని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు అధిక సుంకాలు ఒక్కటే మార్గమని ట్రంప్ కూడా అనుకుంటున్నారు.అలాగే నిన్న అమెరికాలో శాశ్విత పౌరసత్వ అమ్మకాలపై ట్రంప్ చేసిన ప్రకటన ఆ దేశంలో ప్రజలనుండి,మేధావుల నుండి మీడియాలో పెద్ధ ఎత్తున విమర్శల దుమారం చెలరేగుతుంది.చూద్ధాం ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో.
డాక్టర్ కోలాహల రామ్ కిశోర్
సెల్ : 984932849