ఆర్ఆర్ యాక్ట్ ఫైల్ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న అదనపు కలెక్టర్..!
“కార్తికేయ” మిల్లు వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నప్పుడు ఆర్ఆర్ యాక్ట్ నమోదు అయిందన్న అధికారి
ఇటీవలే ఆ మిల్లు హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చినట్లు స్పష్టం …
ఆర్ఆర్ యాక్ట్ ఫైలు ను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని “జన నిర్ణయం” ప్రతినిధికి తెలిపిన హనుమకొండ అదనపు కలెక్టర్…
ఒకప్పుడు ఆ మిల్లు పరిధి వరంగల్ జిల్లా కానీ అదే మిల్లు ఇప్పుడు హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చింది, జిల్లాలు మారడమే ఆ మిల్లర్ కు కలిసొచ్చిందని ఇటు మిల్లర్ లలో, అటు అధికారుల్లో ప్రచారం జరుగుతోంది. 2020-21 రబీ సీజన్ కు సంబంధించిన పౌరసరఫరాల శాఖ హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి లో ఉన్న రైస్ మిల్ కు ధాన్యం పంపగా సదరు మిల్లర్ 4 ఏండ్లు గడిచినా ప్రభుత్వానికి సిఎంఆర్ పెట్టకపోవడంతో పౌరసరఫరాల శాఖ “కార్తికేయ” మిల్లుపై రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ ఆర్ యాక్ట్)నమోదు చేసినట్లు తెలిసినప్పటికీ ఇప్పటివరకు సదరు మిల్లర్ ఆస్తులు వేలం వేయకుండా అధికారులు వేడుకచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై “జన నిర్ణయం” ప్రతినిధి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ను వివరణ కోరగా “కార్తికేయ” రైస్ మిల్ పై ఆర్ఆర్ యాకీ నమోదు అయినప్పుడు ఆ మిల్లు వరంగల్ జిల్లా పరిధిలో ఉండేదని ఇటీవలే హనుమకొండ జిల్లాలో కలవడం జరిగిందని అన్నారు. సదరు మిల్లు పై ఆర్ఆర్ యాక్ట్ నమోదైన ఫైలును పరిశీలిస్తానని ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్ పై తప్పకుండా పూర్తిస్థాయిలో రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే…!